ఇంకొన్ని రోజుల్లో మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 కూడా ముగిసిపోనుంది. అయితే ఈ సీజన్లో మొట్ట మొదటి ఫైనలిస్ట్ గా అఖిల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా అలాగే టాప్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న వారిలో కూడా అఖిల్ కూడా ఒకడు.
తాను ఖచ్చితంగా టాప్ 2 లో ఉండాలని మొదటి నుంచి అనుకున్న అఖిల్ నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ప్లాన్ చేసిన ఒక వీడియో మరియు అతని కోసం చెప్పిన మాటలతో అఖిల్ కు మరింత కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అయ్యింది. ముఖ్యంగా అఖిల్ ఎలా ఫీలయ్యేవాడు అతను పడ్డ బాధలు గురించి అతనికి అర్ధం అయ్యేలా చెప్పడంతో అతడు మరింత ఎమోషనల్ అయ్యాడు.
ఇంకా అలాగే వీడియోలో అఖిల్ జర్నీను కూడా చూపించడంతో అతనికి మరింత ఎనర్జీ వచ్చినట్టు అయ్యింది. దీనితో అఖిల్ ఈసారి టాప్ 2లో కాదు తానే విన్నవ్వబోతున్నా అని బలంగా ఫిక్స్ అయ్యిపోయాడు. మరి అఖిల్ తాను అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.


