మన టాలీవుడ్ దగ్గర వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమానే హను మాన్. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కలయికలో వచ్చిన ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు తెరకెక్కించి సాలిడ్ క్వాలిటీ అందించారు. ఇక దీనికి కొనసాగింపుగా రీసెంట్ గానే మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తో హను మాన్ 2 ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనుకుంటే దీని తర్వాత మరో క్రేజీ కాన్సెప్ట్ సినిమాని ఇప్పుడు ప్రకటించారు. వ్యతిరేకంగా కాలం గడిచే ఓ నగరం సెటప్ తో కొత్త సినిమాని ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనిపై వదిలిన పోస్టర్ కూడా మంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక హీరో ఎవరు, ఇతర డీటెయిల్స్ ని రేపు నవంబర్ 27 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. మరి ఈ వినూత్న కాన్సెప్ట్ ప్రాజెక్ట్ లో ఎవరు కనిపిస్తారు అనేది చూడాలి.


