ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో ‘జైలర్’ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారీ అంచనాలు నెలకొనగా పాన్ ఇండియా ఆడియెన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో జైలర్ రోల్ లో సూపర్ స్టార్ తన మాస్ చూపించి మళ్ళీ తన ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ అందించారు.
ఇక ఈ రోల్ తర్వాత రజినీకాంత్ మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నారని కోలీవుడ్ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. తన కెరీర్ 173వ సినిమాని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో రజినీకాంత్ ఒక మిడ్ ఏజ్డ్ డాక్టర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ గెటప్ కి సంబంధించిన లుక్ కూడా లాక్ చేసినట్టు టాక్. సో ఈసారి ఓ డాక్టర్ హా రజినీకాంత్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్నారు.


