ప్రైమ్ లో “నారప్ప”, “దృశ్యం 2” రిలీజ్ అందులోనా.?

Published on Jul 13, 2021 10:00 am IST


మన టాలీవుడ్ అందరి అభిమాన హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో ఒకటైన మాస్ యాక్షన్ థ్రిల్లర్ “నారప్ప” డైరెక్ట్ ఓటిటి రిలీజ్ నిన్ననే కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ దక్కించుకుని నేరుగా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కంటే చాలా స్పీడ్ గా షూట్ కంప్లీట్ చేసుకున్న చిత్రం “దృశ్యం 2”. మళయాళ బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ కూడా ఓటిటిలోనే రిలీజ్ అయ్యింది. అలాగే ఈ సినిమా తెలుగులో కూడా ఓటిటి లోనే విడుదల అవుతుంది అని ఎప్పటి నుంచో టాక్ ఉంది.

అయితే ఈ సినిమా హక్కులు కూడా ప్రైమ్ వీడియో వారే తీసుకోనున్నారని ఆ మధ్య తెలియగా ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంని కూడా మళయాళ వెర్షన్ ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ నే దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :