న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. హిట్ ఫ్రాంచైజీ వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన ఫీట్ చేయనుంది.
ప్రముఖ యూట్యూబర్ మరియు నటి పియర్ల్ మానే నిర్వహిస్తున్న పియర్ల్ మానే షోలో హిట్-3 మూవీ ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ షోలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ మాత్రమే చేశారు. ఇక ఇప్పుడు హిట్-3 ప్రమోషన్స్ ఈ షోలో జరగనుండటంతో నాని అదిరిపోయే గుర్తింపును సాధించనున్నాడని అభిమానులు అంటున్నారు.
శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తు్న్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రశాంతి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 1న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ కానుంది.