ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ యువ హీరో రన్బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సంజు’. ప్రముఖ సీనియర్ హీరో సంజయ్ దత్ జీవిత కథ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సుమారు రూ. 340కోట్ల షేరును ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ చిత్రం తరువాత బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటుంది ‘దఢక్’. శ్రీ దేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన ఈచిత్రం జూలై 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ . 69. 16కోట్లు రాబట్టి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.
కొత్త జంట తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంత మంచి వసూళ్లను రాబట్టుకోవడం గ్రేట్ అంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. కుర్ర హీరో ఇషాన్ కట్టర్ కథానాయకుడిగా నటించిన ఈచిత్రం మరాఠి లో విజయం సాధించిన ‘సైరాత్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
