షూట్ తర్వాత బైక్ పై టూర్ ప్లాన్ చేసిన స్టార్ హీరో!

Published on Sep 3, 2021 9:02 am IST


కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ ప్రస్తుతం భారీ చిత్రం “వలిమై” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ ని రష్యా దేశంలో కంప్లీట్ చేసుకుంది. మరి ఇదిలా ఉండగా అజిత్ ఇప్పుడు ఒక పెద్ద టూర్ నే ప్లాన్ చేసాడట.

మరి ఈ షూట్ అయ్యాక అజిత్ కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే తన బైక్ ని కూడా అక్కడే ఉంచుకొని రష్యా మొత్తం చుట్టేయ్యాలని అజిత్ ఉన్నారట. మరి అందులో భాగంగానే బయటకి వచ్చిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొత్తం 900 కిలోమీటర్లు బైక్ పై జర్నీ చేసి రష్యా అందాలు ఆస్వాదించాలని అజిత్ ఫిక్స్ అయ్యారట. మరి ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని దీవాళీ రేస్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :