ఈ టాస్క్ తర్వాత నితిన్ “మాస్ట్రో” డైరెక్ట్ స్ట్రీమింగ్.?

Published on Jul 10, 2021 11:00 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్ “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్” కి రీమేక్ గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. అయితే ఈ చిత్రం వచ్చే ఆగష్టు లో డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ కానుంది అని తెలిసిందే.

మరి దానికన్నా ముందు ఓ టాస్క్ ని కంప్లీట్ చేస్తారట. అదే ఈ సినిమా ఆడియో ఆల్బమ్ ని వచ్చే వారం నుంచి విడుదల చేసి ఆ అనంతరం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చే నెలలోనే స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారట. అప్పటి వరకు ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కొనసాగనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందివ్వగా శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :