సినిమా చూపించిన తర్వాతే చిరును ఆహ్వానించారట

Published on Nov 24, 2019 7:06 pm IST

యంగ్ హీరో నిఖిల్ చిత్రం ‘అర్జున్ సురవరం’ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 29న విడుదలకావడానికి రెడీ అయింది. దీంతో చిత్రం బృందం ప్రచార కార్యక్రమాల్ని స్టార్ట్ చేసింది. వాటిలో భాగంగానే ఈ నెల 26న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో భారీగా ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అయితే నిఖిల్ అండ్ టీమ్ ఊరికే వెళ్లి చిరును కార్యక్రమానికి ఆహ్వానించలేదట. ఆయనకు ప్రత్యేకంగా సినిమా చూపించి వేడుకకు రావాలని కొరారట. సినిమా నచ్చిన చిరు వేడుకకు వస్తానని మాటిచ్చారట. మొత్తానికి మెగాస్టార్ హాజరుతో సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటించింది.

సంబంధిత సమాచారం :