యష్ ఈ సెన్సేషనల్ కాంబోపై మళ్ళీ వినిపిస్తున్న బజ్.!

Published on May 22, 2021 10:02 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన “కేజీయఫ్” చిత్రంతో పాన్ ఇండియన్ లెవెల్లో ఓ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇపుడు 2 చాప్టర్ తో మళ్ళీ దేశ ప్రకంపనలు సెట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రం ఇంకా లైన్ లో ఉండగానే ఒక సంవత్సరం కిందట అలా యష్ మన టాలీవుడ్ కి చెందిన మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నాడని బజ్ బయటకి రాగా..

ఈ సెన్సేషనల్ కాంబో మంచి వైరల్ అయ్యింది. అయితే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ కాంబోపై బజ్ స్టార్ట్ అయ్యింది. యష్ 19వ చిత్రంగా ఇది తెరకెక్కనుందని అలాగే పూరి ఆల్రెడీ ఒక సాలిడ్ బ్యాక్ డ్రాప్ కూడా ఎంచుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఓ అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ బజ్ యష్ అభిమానులకు మంచి హై ని ఇస్తుంది.

సంబంధిత సమాచారం :