ఇక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసిన తారక్.!

Published on Sep 3, 2021 1:41 pm IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు స్టేట్స్ లో ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. దానిని తన సినిమాల ఓపెనింగ్స్ నే చెప్తాయి. మరి దీనిని పక్కన పెడితే అంత స్టార్డం లో కూడా తారక్ స్మాల్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడా భారీ విజయాన్ని అందుకున్నాడు. ముందుగా బిగ్ బాస్ అనే గ్రాండ్ రియాలిటీ షో తో ఎంట్రీ ఇచ్చిన తారక్ ఆ తర్వాత మళ్ళీ మరో సీజన్లో కనిపించలేదు.

ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు “ఎవరు మీలో కోటీశ్వరులు” షోతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే అప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ తో ఎలా రికార్డు టీఆర్పీ కొల్లగొట్టాడో ఈసారి ఈ షో ఫ్రాంఛైజ్ లో అన్ని సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ ని రాబట్టి తారక్ హిస్టరీ క్రియేట్ చేసాడు.

గత నాలుగు సీజన్లలో ఫస్ట్ దానికి అత్యధికంగా 9.7 రేటింగ్ రాగా ఇప్పుడు తారక్ హోస్ట్ చేసిన ఐదవ సీజన్ కి 11.4 రేటింగ్ వచ్చింది. మొదటి నుంచి మంచి హైప్ దీనిపై ఉంది దానికి తోడు చరణ్ కూడా గెస్ట్ గా రావడంతో ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ దీనికి వచ్చింది. మొత్తానికి తారక్ రీఎంట్రీ రీసౌండ్ సాలిడ్ గానే వచ్చింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :