“వకీల్ సాబ్” టైంలో అలా చేసి ఉంటే..నాని కీలక కామెంట్స్ వైరల్.!

Published on Dec 26, 2021 10:00 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. అయితే సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు కరెక్ట్ గా ఒక రోజు ఉంది అనగా హీరో నాని చేసిన గట్ ఫుల్ స్టేట్మెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఏపీలో నెలకొన్న టికెట్ ధరల పరిస్థితిపై నాని తన స్పందనను మరోసారి వ్యక్తం చెయ్యడంతో మరోమారు సంచలనం రేగింది. దీనితో ఓ పక్క నానికి కూడా ఇండస్ట్రీ పెద్దల నుంచి ఆడియెన్స్ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా వచ్చింది. మరి ఇదిలా ఉండగా నాని మళ్ళీ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

అస్సలు టాలీవుడ్ కి ఈ సమస్య మొదలయ్యింది “వకీల్ సాబ్” నుంచి అని ప్రస్తావనతో మొదలు కాగా అప్పుడే కనుక టాలీవుడ్ నుంచి అందరూ రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఈపాటికే పరిష్కారం అయ్యిపోయి ఉండేది అని సమస్య అయితే నిజంగా ఉంది కదా?

అప్పుడే అందరం ఒక థాటి మీదకు వచ్చి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉండేది కాదని నాని తెలిపాడు. దీనితో మళ్ళీ నాని చెప్పిన ఈ కీలక పాయింట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :