మళ్ళీ ప్రభాస్ కన్నా ముందే పూజా.?

Published on Jul 1, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొలుపుకున్న ఈ పాన్ ఇండియన్ సినిమా నిజానికి షూటింగ్ అంతా ఎప్పుడో కంప్లీట్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే.

అలాగే ప్రభాస్ కూడా తన చిత్ర యూనిట్ అంతటికీ ఖరీదైన చేతి గడియారాలను కూడా అందించారు. అయితే మళ్ళీ కొన్ని సన్నివేశాలపై రీషూట్స్ చెయ్యాల్సి ఉండగా మళ్ళీ మేకర్స్ ఓ పది రోజులకి షెడ్యూల్ సెట్ చేశారు. దీనితో మళ్ళీ ప్రభాస్ అండ్ పూజా హెగ్డేలు కూడా డేట్స్ ఇచ్చారు.

అయితే ముందు ప్రభాస్ కన్నా ముందే తన షూట్ ను కంప్లీట్ చేసుకున్న పూజా మళ్ళీ ఈసారి షెడ్యూల్ కి కూడా తన షూటింగ్ ను కూడా ప్రభాస్ కన్నా ముందే కంప్లీట్ చేసేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది కంప్లీట్ చేసి తన నెక్స్ట్ సినిమా షూట్ లో కూడా ఈరోజే జాయిన్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఆల్రెడీ రాధే శ్యామ్ నెలలోకి అడుగు పెట్టాం.. మరి మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై ఏదన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :