బిగ్ బాస్ 4 – ఇపుడు ఈ కంటెస్టెంట్ పై పెరుగుతున్న నెగిటివిటి!

బిగ్ బాస్ 4 – ఇపుడు ఈ కంటెస్టెంట్ పై పెరుగుతున్న నెగిటివిటి!

Published on Dec 1, 2020 2:00 PM IST

ఇప్పుడు మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్ సీజన్ 4” ఎలాగో ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో ఎంటర్టైన్మెంట్ కూడా మంచి గ్రిప్పింగ్ గా మారిపోయింది. గత వారం వీక్ ఎపిసోడ్స్ తేలిపోయినా వీకెండ్ లో మాత్రం కావాల్సిన అటెన్సన్ ను మేకర్స్ తెచ్చుకున్నారు.

అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కు గాను జరిగిన ప్రక్రియలో మరికొన్ని విషయాలు ఇంటి సభ్యుల కోసం తెలిసాయి. అయితే వారిలో ఇప్పుడు మరోసారి మోనాల్ గజ్జర్ పై నెగిటివిటీ ఎక్కువవ్వడం జరుగుతుంది. గత రెండు వారాల ముందు వరకు ఎప్పుడో ఎలిమినేట్ అయ్యిపోతుంది అని అంతా అనుకోగా ఆ తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ పెంచుకొంది.

కానీ నిన్న మళ్ళీ అఖిల్ ను నామినేట్ చేసే విషయంలో ఆమె క్రెడిబిలిటీ విషయంలో ఆడియెన్స్ కు మరోసారి క్రిస్టల్ క్లియర్ అయ్యింది. దీనితో ఈసారి మోనాల్ ను మాత్రం పంపించేయాలి అని సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫాలోవర్స్ ఫిక్స్ కూడా అయ్యిపోయారు. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు