అజ్ఞాతవాసి సెకండ్ సాంగ్ ఎప్పుడంటే ?

జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో ‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగిత దర్శకుడు. ఇప్ప‌టికే “బయటకొచ్చి చూస్తే” పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ నెల 11న ”గాలి వాలుగా” పాటను విడుదల చెయ్యబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో మొత్తం 5 పాటలు కంపోస్ చేసాడు అనిరుద్. మొదటి పాట విన్నాం, రెండోపాట వినబోతున్నాం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 20 న జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో 25 వ సినిమా అవ్వడం విశేషం.