పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న ‘ఆహా’..!

Published on Jul 6, 2021 2:05 am IST

కరోనా పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. అయితే దీనిని ముందుగానే గ్రహించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏడాదిన్నర కిందటే తెలుగులో మొట్టమొదటి సారిగా ‘ఆహా’ ఓటీటీని లాంచ్ చేసి సక్సెస్ అయ్యాడు. చిన్న చిన్న సినిమాలు, పలు వెబ్ సిరీస్‌లతో జర్నీ స్టార్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైతూ వస్తున్న ‘ఆహా’ ఇప్పుడు స్టార్ ఓటీటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగానే భారీ సినిమాలు కొనేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కలయికలో వస్తున్న “లవ్ స్టోరీ”, అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, నిఖిల్ 18 పేజెస్ వంటి సినిమాలను కొనేసిన ఆహా ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ రాధేశ్యామ్ హక్కుల కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే అల్లుఅర్జున్ పుష్ప సినిమాను మరో ఓటిటితో కలిసి విడుదల చేయబోతుంది. ఇవే కాకుండా మరికొన్ని క్రేజీ సినిమాలను కూడా దక్కించుకునే పనిలో ఆహా ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :