ఆహా భోజనంబు…మంచు లక్ష్మీ తో విశ్వక్ సేన్ ప్రీమియర్ తేదీ ఫిక్స్!

Published on Jul 21, 2021 7:28 pm IST

బుల్లితెర పై పలు కార్యక్రమాల తో ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మీ, తాజాగా ఆహా భోజనంబు అంటూ ఆహా వీడియో లో ఒక కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో మొదటి గెస్ట్ గా విశ్వక్ సేన్ విచ్చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రీమియర్ తేదీ ను మంచు లక్ష్మీ రివీల్ చేయడం జరిగింది. జులై 23 వ తేదీన మొదటి ఎపిసొడ్ స్ట్రీమ్ కానున్నట్లు తెలిపారు.

అయితే ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎపిసొడ్ అంతా కూడా చాలా ఫన్ గా ఉంటుంది అని తెలిపారు. దీని పై మీ అభిప్రాయం ఏంటి అంటూ నెటిజన్ల కి ప్రశ్న వేశారు. అయితే వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న విశ్వక్ సేన్ ఈ కార్యక్రమం తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అయ్యారు. అయితే విడుదల తేదీ రావడం తో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం :