‘ఆహా’ టీమ్ తమన్నాను వదిలేలాలేరు కదా

Published on Apr 23, 2021 11:00 pm IST

మిల్కీ బ్యూటీ తమన్నా ఓటీటీ విభాగంలో కూడ దూసుకుపోవాలని అనుకుంటోంది. అందుకే ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్మాణంలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఆహా భారీ బడ్జెట్ కేటాయించి ఈ వెబ్ సిరీస్ తీశారు. అయితే ఆశించినంతగా అది ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇక్కడితో తమన్నాకు ఆహాకు రిలేషన్ ఆగిపోలేదు. మొదటి ప్రయత్నం సంతృప్తికరంగా లేకపోయినా తమన్నా మాత్రం ఓటీటీలను వదలదల్చుకోలేదు.

ఆహా కూడ తమన్నాతోనే ఇంకొక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. పేరున్న దర్శకుడే దీన్ని డీల్ చేస్తారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వస్తుందట. వెబ్ సిరీస్ మాత్రమే కాదు తమన్నాతో ఒక టాక్ షో లాంటిది ప్లాన్ చేస్తున్నారు ఆహా బృందం. సరికొత్తగా ఉండేలా దీన్ని డిజైన్ చేస్తున్నారట. మొత్తానికి ఆహాతో తమన్నా రిలేషన్ ఇంకా ఇంకా కొనసాగేలానే ఉంది. ఇకపోతే తమన్నా చేతిలో రెండు మూడు సినిమాలు కూడ ఉన్నాయి.

సంబంధిత సమాచారం :