ఎస్సై దుర్గను లై డిటెక్టర్ తో ఇంటరాగేట్ చేస్తున్న ఆహా టీమ్!

Published on Jul 26, 2021 1:00 am IST


కుడి ఎడమైతే వెబ్ సిరీస్ సక్సెస్ తో ఆహా వీడియో అభిమానులకు సరికొత్త ఎంటర్ టైన్మెంట్ షురూ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో అమలా పాల్ ఎస్సై దుర్గ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే నేరస్థులని విచారించే అమలా పాల్ ను ఆహా టీమ్ విచారించనుంది. అయితే ఎస్సై దుర్గ ను లై డిటెక్టర్ తో విచారించేందుకు సిద్దం అయినట్లు ఆహా వీడియో చెప్పుకొచ్చింది. కుడి ఎడమైనా, ఎడమ కుడి అయినా నేను నిజాలు మాత్రమే చెబుతాను, అబద్ధాలు అసలు చెప్పను అంటూ చెప్పుకొచ్చారు అమలా పాల్. అయితే తనను ఏమీ ప్రశ్నలు అడిగారు, తను ఏం సమాధానం చెప్పిందో త్వరలో తెలియనుంది. అందుకు సంబంధించిన వీడియో ను ఆహా అభిమానులను షేర్ చేయడం జరిగింది.

అయితే అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ సర్వత్రా ఆసక్తి గా కొనసాగడం తో రెండవ సీజన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఆహా వీడియో లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :