సుశాంత్ మరణం విషయంలో కీలక రిపోర్ట్ అందజేసిన ఎయిమ్స్!

Published on Sep 29, 2020 4:04 pm IST

గత జూన్ నెలలో బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా తన నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యగా మొదలైన ఈ సున్నితమైన అంశం ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ ఇన్ని నెలలు కొనసాగుతూ వచ్చింది.

అయితే ఈ కేసును ఇప్పటి సిబిఐ వారు విచారణ జరుపుతూ ప్రధాన వ్యక్తులు అందరిని అన్ని కోణాల్లో విచారించింది. అయితే తాజాగా ఎయిమ్స్ వారు సిబిఐ కి ఒక కీలక రిపోర్టును అందించారట. ఈ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ శరీరంలో ఎలాంటి విషము లేదని ఇది ఆత్మహత్య మాత్రమే అని వారు తెలిపారు.

అంతే కాకుండా ఆ సమయంలో సుశాంత్ మానసికంగా బాధ పడి ఉంటాడని అందుకే ఆత్మ హత్య చేసుకున్నాడని ఆ రిపోర్ట్ లో తెలిపారు. ఇప్పటికే అతని శరీరంపై ఉన్న అనుమానాస్పద గుర్తులు ఏమిటని అనేక అనుమానాలు ఉన్నాయి మరి వాటి పరంగా కూడా ఆరా తీసి అసలు సుశాంత్ అభిమానులు మరియు సానుభూతి పరులు ఇంకా పోరాటం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More