ప్లాప్ టాక్ తో కూడా డీసెంట్ కలెక్షన్లను రాబడుతున్న ఐరా !

Published on Apr 2, 2019 8:54 am IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఐరా’ ఇటీవల విడుదలై నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నయన్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రం కోలీవుడ్ లో మాత్రం డీసెంట్ వసూళ్లను రాబడుతుంది. నాలుగు రోజుల్లో ఈచిత్రం తమిళనాడు లో 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం.

ఫ్యామిలీ , హారర్ డ్రామా గా సర్జున్ తెరకెక్కించిన ఈచిత్రం అదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదలై ప్రమోషన్స్ లేకపోవడం అలాగే బ్యాడ్ టాక్ కారణాలతో ఓపెనింగ్స్ ను కూడా రాబట్టుకోలేకపోయింది. కేజేఆర్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుందరమూర్తి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :