సమీక్ష : ఐరా – హారర్ తక్కువ ఎమోషన్స్ ఎక్కువ

సమీక్ష : ఐరా – హారర్ తక్కువ ఎమోషన్స్ ఎక్కువ

Published on Mar 29, 2019 4:00 AM IST
Airaa movie review

విడుదల తేదీ : మార్చి 28, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నయనతార, యోగిబాబు

దర్శకత్వం : సర్జున్

నిర్మాత : కేజేఆర్ స్టూడియోస్

సంగీతం : సుందర మూర్తి

సినిమాటోగ్రఫర్ : సుదర్శన్ శ్రీనివాస్

ఎడిటర్ : కార్తీక్ జోగేష్

లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ టైం రెండు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం ‘ఐరా’. ఫ్యామిలీ హారర్ నేపథ్యంలో సర్జున్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు తమిళం తోపాటు తెలుగులోనూ విడుదలైయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

యమున (నయనతార) జర్నలిస్ట్ కానీ ఆమె చేస్తున్న జాబ్ తో విసుగువచ్చి యూట్యూబ్ లో వీడియోలను చేసి పాపులర్ కావాలని అనుకుంటుంది కానీ దీనికి ఆమె బాస్ ఒప్పుకోడు. ఇంతలో యమున తల్లి తండ్రులు కూడా ఆమె ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం తో ఆమె తన అమ్మమ్మ వాళ్ళ వూరు వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె ఉంటున్న ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించి యూట్యూబ్ లో వీడియోలు చేయడం మొదలు పెడుతుంది.

ఇక మరో వైపు వరస హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలకు కారణం తన లవర్ భవాని అని తెలుసుకుంటాడు అభినవ్. ఈ క్రమంలో భవాని ,యమున ను కూడా చంపాలనుకుంటుంది. ఇంతకీ ఈ భవాని ఎవరు ? ఆమె గతం ఏమిటి ? ఆమె చావుకు యమున ఎలా కారణం అయ్యింది ? చివరికి భవాని ,యమున ను ఏంచేసింది ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి మేజర్ ప్లస్ అంటే నయనతార అనే చెప్పొచ్చు. ఆమె నటన తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఇటు యమున పాత్రలో గ్లామర్ గా కనిపిస్తూ భవాని పాత్రలో డి గ్లామరైజ్డ్ పాత్రకు కూడా న్యాయం చేసింది. తన నటనతో సినిమా అంత వన్ మ్యాన్ షో చేసింది.

ఇక సినిమా స్టార్ట్ చేసిన విధానం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని హారర్ సన్నివేశాలు భయపెడతాయి. ఇక అలాగే దర్శకుడు యమున , భవాని పాత్రలను బ్యాలన్స్ చేసిన తీరు బాగుంది.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నా కంటెంట్ లేకపోవడంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ను ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత స్లో నరేషన్ తో సినిమాపై ఆసక్తిని పోగొట్టాడు. ఇక భవాని , యమున ఫై ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుందో అనే అంశాన్ని కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు.

సినిమాలో నయన్ పాత్ర తప్ప మిగితా పాత్రలేవి రిజిస్టర్ కావు. కమెడియన్ యోగిబాబు కామెడీ కూడా విసుగుతెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు హారర్ ను వదిలేసి పూర్తిగా ఎమోషన్స్ మీద శ్రద్ధ చూపెట్టడంతో ఈ చిత్రం ఈ జనరేషన్ వారికీ అంతగా కనెక్ట్ కాదు. స్క్రిప్ట్ లో ఇంకొంచెం డెప్త్ ఉండి, ఎంగేజింగ్ నరేషన్ తో ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదే.

సాంకేతిక విభాగం :

ఒక ఫ్యామిలీ హారర్ డ్రామా ను తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు సర్జున్ చాలా చోట్ల తడబడ్డాడు. లాజిక్ లేని సన్నివేశాలు , స్లో నరేషన్ సినిమా ఫలితం ఫై ప్రభావం చూపాయి. అయితే హారర్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఇక మిగితా టెక్నీషయన్స్ విషయానికి వస్తే సుందర మూర్తి అందించిన సంగీతం యావరేజ్ గా వుంది. సాంగ్స్ కథకు అడ్డంకి గా అనిపిస్తాయి. అయితే హారర్ సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా బాగా ఎలివేట్ చేశాడు.

సుదర్శన్ శ్రీనివాస్ కెమెరా పనితనం బాగుంది. విలేజ్ అందాలను బాగా చూపించాడు. కార్తీక్ జోగేష్ ఎడిటింగ్ పర్వేలేదు. లో బడ్జెట్ లో తీసిన మంచి క్వాలిటీతో సినిమాను నిర్మించారు కేజేఆర్ స్టూడియోస్.

తీర్పు :

ఫ్యామిలీ హారర్ డ్రామా గా తెరకెక్కిన ఈ ఐరా లో నయనతార తన నటనతో సినిమా ను కాపాడే ప్రయత్నం చేసిన స్లో నరేషన్, లాజిక్ లేని సన్నివేశాలు ఫలితాన్ని దెబ్బతీశాయి. నయన్ మొదటి సారి రెండు పాత్రల్లో నటించిన కావడం ఒక్కటే సినిమా కు హైలైట్. చివరగా ఈ చిత్రం ఎమోషనల్ హారర్ డ్రామా ను ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది కానీ మిగతా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు