రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఓ సుకుమారి’.. ఎప్పుడంటే..?

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఓ సుకుమారి’.. ఎప్పుడంటే..?

Published on Jun 30, 2026 7:01 PM IST

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ తిరువీర్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ సుకుమారి’. ఈ చిత్రంలో తిరువీర్ ఒక పిసినారి పాత్రలో నటిస్తుండగా, ఐశ్వర్య రాజేష్ మనుషులకు షాక్‌లు ఇచ్చే వింత లక్షణం ఉన్న అమ్మాయిగా కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘యాదిగాని పెళ్లి’ సాంగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ ఒక క్రేజీ పోస్టర్‌ ద్వారా ఈ సినిమాను జూలై 17న పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమకున్న వింత లక్షణాలతోనే ఇద్దరూ ఒకరినొకరు ఎలా ప్రేమించారనేది ఈ పోస్టర్‌లో ఆసక్తికరంగా చూపించారు.

భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు