మెగా హీరోకు హీరోయిన్ మారిపోయింది

Published on Oct 31, 2020 1:10 am IST

మెగా హీరో సాయి తేజ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ సినిమాలతో హిట్ ట్రాక్లో ఉన్న ఆయన కొత్త చిత్రం ;సోలో బ్రతుకే సో బెటరు’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం విడుదలయ్యే లోపే కొత్త సినిమాను మొదలుపెట్టారాయన. ఈ చిత్రాన్ని దేవ కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ‘

మొదట ఈ చిత్రంలో తేజ్ సరసం నివేత పేతురాజ్ ను కథానాయకిగా అనుకున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘చిత్రలహరి’లో నటించి అలరించారు. అందుకే వీరిద్దరినీ ఫైనల్ చేశారు. కానీ చివర్లో నివేత స్థానంలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారు. ఈ మార్పు వెనుక కారణాలు తెలియలేదు కానీ మార్పు మాత్రం జరిగిందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని దేవ కట్ట యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ సైతం ఒక కీ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More