టాలీవుడ్ అంటే ఐశ్వర్యకు అంత చిన్నచూపెందుకు?

టాలీవుడ్ అంటే ఐశ్వర్యకు అంత చిన్నచూపెందుకు?

Published on Jul 13, 2019 9:02 AM IST

యువకుల కలల రాణిగా దశాబ్దాలపాటు వెలుగొందిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ లో మునుపటి ఊపు లేనప్పటికీ అడపాదపా అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఐశ్వర్య 1994 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకొని ఒక్కసారిగా ఫేమస్ ఐయ్యారు. దిగ్గజ దర్శకుడైన మణిరత్నం డైరెక్షన్ లో మోహన్ లాల్,ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో 1997లో విడుదలైన తమిళ చిత్రం “ఇరువర్” తో ఐశ్వర్య నటిగా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ చిత్రం “ఇద్దరు” పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. ఆతరువాత దర్శకుడు శంకర్ తీసిన “జీన్స్” చిత్రం ఘనవిజయం సాధించడంతో ఐశ్వర్య బాలీవుడ్ లో అవకాశం దక్కించుకుంది. మెల్లగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ తిరుగులేని తారగా ఎదిగింది.

బాలీవుడ్ లో బిజీ అయిన తర్వాత కూడా, ఐశ్వర్య ఆరంగేట్రం చేసిన తమిళ సినిమాలలో మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా నటిస్తూ వచ్చింది. కానీ తెలుగు చిత్రాల వైపు ఆమె కన్నెత్తి కూడా చూడలేదు. చాలా సంధర్బాలలో తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి,వెంకటేష్,నాగార్జున,బాలకృష్ణ వంటి నటుల సరసన హీరోగా ఆమెతో చేయించాలని చేసిన అన్ని ప్రయత్నాలు వ్యర్ధమైపోయాయి. ఆమె రెమ్యూనరేషన్ ఇక్కడి స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండటం ఒకటైతే అసలు ఆమె తెలుగు సినిమాలలో నటిచడానికి అంత ఆసక్తిచూపించేవారు కాదు. ఎప్పుడు మన దర్శకులు,నిర్మాతలు ఆమెను సంప్రదించినా వివిధ కారణాలతో ఆమె తిరస్కరించడం జరిగేది. ఆమె తీరుతో విసిగిపోయిన మన నిర్మాతలు ఆ తరువాత ఆమెను సంప్రదించడమే మానేశారు. అక్కినేని నాగార్జున నటించిన “రావోయి చందమామ” చిత్రంలో మాత్రం ఐశ్వర్య ఒక ఐటెం సాంగ్ లో కనిపించి అలరించారు. అంతకు మించి తెలుగులో ఆమె చేసిన డైరెక్ట్ సినిమాలు లేవు.

మెగాస్టార్ హీరోగా కొరటాల దర్శకత్వంలో త్వరలో మొదలు కానున్న చిత్రంలో ఐశ్వర్యను నటింపచేయాలని సంప్రదించగా ఆమె రెమ్యూనరేషన్ భారీగా అడగడంతో పాటు, ఆమె వ్యక్తిగత సిబ్బంది వేతనాలు,సౌకర్యాల విషయంలో గొంతెమ్మ కోర్కెలు కోరిందట. దీంతో ఈ చిత్రానికి ఐశ్వర్యను తీసుకోవాలనే ఆలోచనను విరమించుకొనే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ఏది ఏమైనా ఐశ్వర్య తీరును చూస్తున్న వారు మాత్రం,ఫార్మ్ కోల్పోయాక కూడా ఇంత టెక్కు అవసరమా అని అనుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు