వైరల్ అవుతున్న ఐశ్వర్య అరుదైన ఫోటో

Published on Aug 6, 2019 2:03 am IST

దేశంలో అందానికి మారుపేరుగా ఐశ్వర్య రాయ్ వెలుగొందారు. ఐశ్వర్య పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దశాబ్దాలపాటు ఆమె కుర్ర కారు కలల రాణిగా కీర్తించబడ్డారు. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తమిళ చిత్రం “ఇరువర్” తో వెండి తెరకు పరిచయమయ్యారు. అదే ఏడాది బాబీ డియోల్ హీరోగా వచ్చిన “ఔర్ ప్యార్ హోగయా” చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన ఐస్వర్య అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆమె బాలీవుడ్ ని ఏలడం జరిగింది.

ఐతే తాజాగా ఐశ్వర్య పాత ఫోటో ఒకటి సోషల్ మాద్యమాలలో వైరల్ గా మారింది. బ్లాక్ టి షర్ట్ ధరించి,పోనీ టైల్ తో ఉన్న ఆ ఫోటో ఆమె కెరీర్ ప్రారంభలోనిది. ఆ ఫోటో చూస్తుంటే ఐశ్వర్య సినిమా కెరీర్ కి ముందు చిత్రంలా ఉంది.ఆ ఫోటో చూసి ఇప్పుడు ఐశ్వర్యను చూస్తుంటే ఆమె అందం ఇంకా తరగలేదనిపిస్తుంది. గత సంవత్సరం ఆమె “ఫన్నే ఖాన్” అనే హిందీ చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం :