మహేష్ ని ఫాలో అవుతున్న అజయ్ దేవగణ్.

Published on May 17, 2019 4:05 pm IST

ప్రిన్స్ మహేష్ నటుడిగానే గాక వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు. కార్పొరేట్ దిగ్గజ కంపెనీలకు మహేష్ మోస్ట్ వాంటెడ్ బ్రాడ్ అంబాసిడర్. ఇప్పటికే టాలీవుడ్ లో ఏ హీరో చేయనన్ని కంపెనీలకు మహేష్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.వీటితో పాటు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఏ. ఎం. బి సినిమాస్ ని స్థాపించారు.
ఇలానే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కూడా మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారని సమాచారం. సుమారు 600కోట్ల పెట్టుబడితో నార్త్ ఇండియా మొత్తం మీద 250 తెరల్ని ఏర్పాటు చేయనున్నారని వినికిడి.

ఈ మధ్య ప్రేక్షకులు సాధారణ థియేటర్ల వైపు కన్నెత్తి చూడడం . వారి అభిరుచులు మారాయి. అందుకు అనుగుణంగా ఆయా పట్టణాల్లో మల్లీ ప్లెక్స్ థియేటర్లు వెలుస్తున్నాయి. దీనిపైనే నటుడు అజయ్ దేవగణ్ దృష్టి పెట్టారు. న్యూ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ ..డిజిటిల్ తో కూడిన సౌండ్ సిస్టం ..ఇలా ప్రేక్షకులను మైమరిచి పోయేలా చేయనున్నాయి ఈ మల్టీప్లెక్స్‌లు. పెట్టిన పెట్టుబడి రాబడి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు అజయ్.

సంబంధిత సమాచారం :

More