ఆగష్ట్ 13న ఓటీటీలో అజయ్‌దేవ్‌గణ్‌ “భుజ్”..!

Published on Jul 8, 2021 3:00 am IST


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ “భుజ్‌” ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ఓటీటీలో విడుదలకు సిద్దమయ్యింది. గతంలోనే ఓటీటీలో విడుదల చేస్తామని వెల్లడించినా విడుదల తేదీని మాత్రం అప్పుడు చెప్పలేదు. అయితే తాజాగా ఆగస్టు 13న హాట్‌స్టార్‌లో “భుజ్” సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల నేపధ్యంలో అభిషేక్‌ దుదయా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా కనిపిస్తుండగా, సంజయ్‌దత్, సోనాక్షి సిన్హా, శరద్‌ ఖేల్‌కర్, యమ్మీ విర్క్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :