భారతీయుడు 2 నుండి తప్పుకున్న స్టార్ హీరో !

Published on Feb 17, 2019 5:07 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ – క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కతున్న ‘భారతీయుడు 2’ మొదటి షెడ్యూల్ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తరువాత మార్చి లో ఓవర్సీస్ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ ఆయన ప్రస్తుతం ‘తానాజీ ది ఆన్ సంగ్ వారియర్’ కోసం తన డేట్స్ కేటాయించడంతో ఈ సినిమా నుండి తప్పుకున్నాడని సమాచారం. మరి ఆ పాత్రకు శంకర్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :