మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం’ చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయగా, ప్రతి చోట విజయం అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ చిత్రం దృశ్యం-2 కూడా అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడో భాగం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మోహన్ లాల్ లీడ్ రోల్‌లో జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూడో భాగం చిత్రం మలయాళంలో ఇప్పటికే షూటింగ్ ముగించుకుంది.
కాగా, ఇప్పుడు ఈ మూడో పార్ట్ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ కూడా అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను వారు రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అభిషేక్ పాఠక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రియా సరన్, టబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే, ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ దృశ్యం-3 పై పడింది. మలయాళంలో షూటింగ్ ముగించుకున్న ఈ క్రేజీ సినిమాను బాలీవుడ్‌లోనూ స్టార్ట్ చేస్తున్నారని.. మరి విక్టరీ వెంకటేష్ హీరోగా దృశ్యం-3 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


