పవర్ ఫుల్ గా కనిపిస్తున్న అజిత్…వలిమై ఫస్ట్ లుక్ విడుదల!

Published on Jul 11, 2021 10:10 pm IST

హెచ్. వినోత్ దర్శకత్వం లో అజిత్ కుమార్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం వలిమై. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ కుమార్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ మొత్తానికి ఈ సాయంత్రం వచ్చేశారు. జీ స్టూడియోస్ మరియు బోని కపూర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో కార్తికేయ గుమ్మకొండ, హుమా కురేషి, యమి గౌతమ్, రాజ్ అయ్యిప్ప, యోగి బాబు లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :