బైక్ చేజింగ్ సీన్ లో ప్రమాదానికి గురైన హీరో అజిత్

Published on Feb 19, 2020 9:08 am IST

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఓ యాక్షన్ సన్నివేశం కోసం బైక్ చేజింగ్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఐతే ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం. తమ అభిమాన హీరో ప్రమాదం నుండి బయటపడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అజిత్ తన 60వ చిత్రం దర్శకుడు హెచ్ వినోత్ డైరెక్షన్ లో చేస్తున్నారు. వాలిమై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొద్దినెలలుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అజిత్ మరోమారు పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. అజిత్ కోలుకున్న వెంటనే నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :