అజిత్ మోస్ట్ అవైటెడ్ “వాలిమై” ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్!

Published on Mar 15, 2021 9:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరోలలో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మన దగ్గర పవన్ మరియు మహేష్ ల సినిమాలకు ఏ రేంజ్ లో ఉంటుందో అక్కడ అజిత్ విజయ్ సినిమాలకు ఆ లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఈ అందరు హీరోలు కూడా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు.

అయితే అజిత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వాలిమై” కోసం అతని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ చిత్ర బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆ అప్డేట్ ను రివీల్ చేస్తున్నారు.

వచ్చే మే 1 అజిత్ 50వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా అప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యడమే కాకుండా అక్కడ నుంచే ఈ చిత్రం తాలూకా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయని కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ భారీ చిత్రానికి హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :