ఓటిటిలో గ్లోబల్ గా అదరగొడుతున్న అజిత్ సినిమా.!

Published on Feb 14, 2023 8:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా “తునివు”. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ అండ్ మెసేజ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అజిత్ కెరీర్ లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. మరి ఈ చిత్రం రీసెంట్ గానే దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఫ్లిక్స్ లో అనేక భాషల్లో రిలీజ్ కాగా మొదటి 24 గంటల్లోనే అనేక దేశాల్లో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం గ్లోబల్ గా కూడా అదరగొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్స్ లో టాప్ 5 లోకి చేరుకుంది. దీనితో ఓటిటి లో కూడా ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో నటించగా జిబ్రాన్ సంగీతం అందించాడు అలాగే బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :