అజిత్ అతనికి మూడవ ఛాన్స్ కూడ ఇచ్చేశారు

Published on Apr 28, 2021 9:30 pm IST

అజిత్ ఒక దర్శకుడ్ని నమ్మితే ఎంతవరకు తీసుకెళ్తారో డైరెక్టర్ శివను చూస్తే అర్థమవుతుంది. శివతో అజిత్ వరుసగా నాలుగు సినిమాలు చేశారు. నాలుగు సూపర్ హిట్ సినిమాలే. శివకు ఎలాగైతే వరుసగా ఆఫర్లు ఇచ్చారో ఇప్పుడు హెచ్.వినోత్ కు కూడ అలాగే ఇస్తున్నారు. అజిత్, వినోత్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘నెర్కొండ పారవై’. అది మంచి విజయాన్నే అందుకుంది. అందుకే రెండో సినిమా ఛాన్స్ ఇచ్చారు. అదే ‘వాలిమై’. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఫైనల్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అది పూర్తికాకుండానే
హెచ్.వినోత్ దర్శకత్వంలో మూడవ సినిమాకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది చాలా రోజుల నుండి చర్చల్లో ఉన్నదే అయినా తాజాగా అజిత్ ఓకే చెప్పేశారట. దీన్ని కూడ బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇది కూడ పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ కథే. అజిత్ ఒక దర్శకుడితో సినిమా చేస్తుండగానే అతనితో ఇంకో సినిమాకు ఓకే చెప్పడం ఇదే తొలిసారి. ఈ సినిమా జూలై నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :