ఫుల్ స్వింగ్ లో అజిత్ వాలిమై షూటింగ్..!

Published on Dec 13, 2019 7:35 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం వాలిమై. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణంలో దర్శకుడు హెచ్ వినోత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నిరవధికంగా సాగుతుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అజిత్ కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. అలాగే అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారి రోల్ చేస్తున్నారని తెలుస్తుంది. చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది దీపావళి కానుకగా వాలిమై విడుదల కానుంది.

అజిత్ గత చిత్రాలకు మించిన బడ్జెట్ తో వాలిమై తెరకెక్కుతుంది. ఈ ఏడాది అజిత్ ఇదే కాంబినేషన్ లో నెర్కొండ పార్వై చిత్రాన్ని చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. నెర్కొండ పార్వై లో సెన్సిబుల్ లాయర్ గా అజిత్ ని ప్రెజెంట్ చేసిన వినోత్ వాలిమై మూవీలో కంప్లీట్ మాస్ యాక్షన్ హీరోగా చూపించనున్నారు. కాంబినేషన్ దృష్ట్యా వాలిమై చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More