అజిత్ “వలిమై” ఫస్ట్ లుక్ కి ఇదే ఫైనల్ డేటా.?

Published on Jul 8, 2021 8:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వలిమై”దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్ పై సౌత్ ఇండియన్ సినీ వర్గాల్లో అలా రచ్చ లేస్తూనే ఉంది.

దీనితో సోషల్ మీడియాలో అజిత్ అభిమానుల హంగామా ఎక్కడా ఆగడం లేదు. మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన వలిమై ఫస్ట్ లుక్ లాంచ్ పై ఇది వరకే ఎన్నో డేట్స్ వినిపించాయి. కానీ గా ఈ జూలై 15 ఫిక్స్ అయ్యినట్టుగా నయా టాక్ బయటకి వచ్చింది. ఆరోజున ముందే దర్శకుడు చెప్పినట్టుగా మోషన్ పోస్టర్ టీజర్ తో ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ డేట్ కి అయినా థలా ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియన్ లెవెల్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే యువన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :