అజిత్ సినిమాకి అక్కడ సూపర్ రెస్పాన్స్ !

అజిత్ సినిమాకి అక్కడ సూపర్ రెస్పాన్స్ !

Published on Jun 4, 2018 11:00 AM IST

తమిళ స్థార్ హీరో అజిత్, యాక్షన్ చిత్రాల దర్శకుడు శివల కలయికలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘వివేగం’. భారీ అంచనాల మధ్య గత ఏడాది ఆగష్టులో విడుదలైన ఈ సినిమా తమిళంలో పెద్దగా విజయం సాధించలేక పోయింది. వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ‘విశ్వాసం’ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇక ఇటీవల ఈ సినిమాని ‘వీర్’ పేరుతో హిందీలో రిలీజ్ చేశారు. అక్కడ మాత్రం ఈ సినిమాకి మంచి రెస్పాన్ వస్తోంది. ప్రధానంగా ఈ సినిమాలోని హెవీ యాక్షన్ సీన్లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని సత్య జ్యోతి సంస్థ నిర్మించింది .

తాజా వార్తలు