అఖండ ఫైనల్ షెడ్యూల్ ముగిసినట్టేగా..!

Published on Aug 12, 2021 12:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉండగా ఇప్పుడు అది కాస్త అయిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న స్టంట్‌ శివ, బోయపాటి మరో ఇద్దరు వర్షంలో తడిసి ఎంజాయ్ మూడ్‌లో కనిపించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్ర యూనిట్ 80 రోజుల్లో పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :