నైజాంలో స్ట్రాంగ్ గా నిలబడ్డ “అఖండ” 6వ రోజు వసూళ్లు ఇవే.!

నైజాంలో స్ట్రాంగ్ గా నిలబడ్డ “అఖండ” 6వ రోజు వసూళ్లు ఇవే.!

Published on Dec 8, 2021 11:00 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ” విడుదలై రోరింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం వారాంతం ముగిసి వీక్ డేస్ కి వచ్చినా కూడా మంచి వసూళ్లను రాబడుతూ నిలకడగా కొనసాగుతుంది. మరి నైజాం లో అయితే ఈ చిత్రం ఇంకా స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తుంది.

తాజాగా సినిమా ఆరవ రోజు వసూళ్ల వివరాలు తెలిసాయి. దీని ప్రకారం అఖండ నైజం లో 6వ రోజు 91 లక్షల షేర్ ని రాబట్టింది. మరి ఆరో రోజు కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే మాస్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాని ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు