అఖిల్ 3 ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు !

Published on Sep 16, 2018 2:10 pm IST

‘హలో’ తరువాత యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న మూడవ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ‘తొలి ప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్19 న సాయంత్రం 4గంటలకు ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేయనున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘సవ్యసాచి’ ఫెమ్ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది . తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :