“ఏజెంట్” సినిమాకి ఆ సీన్ హైలెట్ అవుతుందట..!

Published on Aug 14, 2021 2:58 am IST

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ మాస్ లుక్ తో కొత్తగా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధిచి తాజాగా ఓ ఇంటెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో పదిహేను నిమిషాల పాటు ఓ చేజింగ్ సీన్‌ని ప్లాన్ చేశారట.

అయితే ఈ చేజింగ్ సీన్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరిస్తున్నారని, ఈ సీన్ కోసమే చిత్ర బృందం విదేశాలకు వెళ్ళనుందని, హాలీవుడ్ టెక్నీషియన్ల సహాయంతో చిత్రీకరించే ఆ సన్నివేశం సినిమా మొత్తానికి హైల్ట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుందట. అయితే 15 నిమిషాల పాటు ప్లాన్ చేసిన ఛేజింగ్ సీన్ ద్వారా అఖిల్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :