గుర్రపు స్వారీ చేస్తున్న అఖిల్ అక్కినేని!

Published on Aug 9, 2021 11:00 am IST


అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎజెంట్ చిత్రం లో హీరో గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం అఖిల్ తన దేహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం అఖిల్ ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ అక్కినేని గుర్రపు స్వారీ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కొద్ది సేపటికే వైరల్ గా మారాయి. సండే రోజు తన గిజెల్లే తో గడిపిన మూమెంట్స్ అంటూ ఇన్స్టా లో చెప్పుకొచ్చారు అఖిల్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎజెంట్ చిత్రం కోసం అఖిల్ పూర్తి గా మారిపోయారు. స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్న ఫోటోలు సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా,అనిల్ సుంకర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :