‘అఖిల్’ సినిమా పరిస్థితి ఏంటో ?

Published on May 19, 2019 11:17 am IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అయిపొయింది. అలాగే మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ వచ్చింది. రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ, సినిమా మాత్రం ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు.

అయితే సినిమాకి బడ్జెట్ ఎక్కువవుతుందని.. అందుకే సినిమా ఆలస్యం అవుతుందని.. సినిమాని ఎలాగైనా పట్టాలెక్కించడానికి నాగార్జున కూడా డబ్బులు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవలే వార్తలు వచ్చాయి. మొత్తానికి అఖిల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు గాని, రోజుకొక రూమర్ అయితే బయటకు వస్తోంది.

ఇక ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. కాగా భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :

More