‘అఖిల్ – పూజా హెగ్డే’ల లవ్ ట్రాక్ హైలైట్ అట !

Published on Dec 14, 2019 7:08 pm IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వస్తున్నాయట. ఈ సీన్స్ ఇంటర్వెల్ లో వస్తాయని.. ఇవి సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

ఇక ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. ఈ సినిమాతోనైనా అఖిల్ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More