బర్త్ డేకి కొత్తగా ప్లాన్ చేసిన ‘అఖిల్’ !

Published on Apr 7, 2020 7:22 pm IST

అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోల్లో యూత్ కి బాగా దగ్గరైన యంగ్ యూత్ ఫుల్ హీరో ‘అక్కినేని అఖిల్’ పుట్టినరోజు రేపు. ఈ సందర్బంగా అఖిల్ తన ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. రేపు తన పుట్టిన రోజు అని, కానీ సెలెబ్రేషన్స్ ఈ కష్ట సమయంలో కరెక్ట్ కాదని.. అందుకే అందరు ఇంట్లోనే సేఫ్ గా ఉండండని తెలిపారు. అలాగే తన సినిమాకి సంబధించి ఎలాంటి అప్ డేట్ వద్దు అనుకున్నానని..అయితే రేపు నా పుట్టిన రోజు సందర్భంగా మా ఫ్యామిలీ ఫోటో ఒకటి పోస్ట్ చేయబోతున్నాను. అలాగే నా కోసం మీరు కూడా మీ ఫ్యామిలీ హ్యాపీ ఫోటో ఒకటి పోస్ట్ చేయండని అఖిల్ ఫ్యాన్స్ ను కోరారు.

ఇక అఖిల్ నెలల బాలుడిగా ఉన్నప్పుడే కెమెరా ముందు ‘సిసింద్రీ’గా చిరునవ్వులు చిందించి అక్కినేని అభిమానులను బాగా అలరించాడు. ప్రస్తుతం అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా చేస్తున్నాడు. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. వ‌రుస‌ పెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకం పై తెర‌కెక్కుతుండ‌టంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More