ప్చ్.. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు ?

Published on Jul 15, 2019 9:44 am IST

‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. ఈ రోజు నుంచి షెడ్యూలు కూడా వేసారు. కానీ ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే చాలమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారు.. కానీ ఇంకా ఎవ్వరూ సెట్ కాలేదు. అయితే ఫస్ట్ షెడ్యూల్ కి హీరోయిన్ తో పనిలేదు కాబట్టి, సమస్య లేదు. మరి ఫస్ట్ షెడ్యూల్ ముగిసే సరికి హీరోయిన్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.

మరి అఖిల్ సరసన కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా లేక రష్మికా మండన్నను తీసుకుంటారా అనేది చూడాలి. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More