‘అఖిల్’తో పూజా హెగ్డే రొమాన్స్ బాగా వస్తోందట !

Published on Feb 23, 2020 11:30 pm IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే లాస్ట్ షెడ్యూల్ లో చిత్రబృందం ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ ను కూడా షూట్ చేశారు. లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడా..? ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . మరి ఈ సినిమా అయినా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More