అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే లెనిన్. అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ రూరల్ మాస్ యాక్షన్ డ్రామా పట్ల ఇప్పుడు మంచి బజ్ నెలకొంది.
ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తూ ఉండడం లేటెస్ట్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా రావడం వంటివి సినిమాకి అదనపు బూస్టప్ గా నిలిచాయి. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఏపీలో బుకింగ్స్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా సాలిడ్ స్టార్ట్ ని నమోదు చేస్తుంది అని చెప్పొచ్చు.
డే 1 ఎర్లీ షోస్ అంతా కూడా దాదాపు మంచి ఆక్యుపెన్సీ లని ఈ సినిమా చూస్తోంది. సో లెనిన్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించడం జరిగింది అలాగే నాగవంశీ, కింగ్ నాగార్జునలు నిర్మాణం వహించారు.


