పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ‘అఖిల్’

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ‘అఖిల్’

Published on Oct 13, 2015 7:52 PM IST

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి దూసుకువస్తున్న మూడవతరం నటవారసుడు అఖిల్ అక్కినేని. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అఖిల్’. ఇటీవలే యుఎస్లో ప్రీ ప్రమోషనల్ టూర్ ఫినిష్ చేసుకొని వచ్చిన అఖిల్ బాలన్స్ ఉన్న తన ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ ని కూడా ఫినిష్ చేసాడు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. రిలీజ్ సమయం దగ్గరికి పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా చివరి దశకు తీసుకు వచ్చారు.

అక్టోబర్ 16న అఖిల్ సినిమాని సెన్సార్ కి పంపనున్నారు. దాంతో మరో రెండు రోజుల్లో అన్ని పనులను పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇకపోతే సెన్సార్ అవ్వగానే అఖిల్ అండ్ టీం ఆంధ్ర, తెలంగాణలలో ప్రీ ప్రమోషనల్ టూర్ ని నిర్వహించనున్నారు. అఖిల్ ఫస్ట్ సినిమా అక్కవడం వలన అన్ని వర్గాల ప్రేక్షకులకు అఖిల్ ని రీచ్ చెయ్యాలని గ్రాండ్ గా ప్రమోషన్స్ ని షెడ్యూల్ చేసారు. అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిచారు. నితిన్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది.

తాజా వార్తలు